Tuesday, April 30, 2024

రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న పోలీసు కేసులు

- Advertisement -
- Advertisement -

Revanth-Reddy

మనతెలంగాణ/హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో మొత్తం 63 పోలీసు కేసులు నమోదయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్‌రెడ్డి విడుదలను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆ కేసులో బెయిల్ లభించిన వెంటనే పిటి వారెంట్‌పై రేవంత్‌రెడ్డిని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ఏవియేషన్ నిబంధనలను అతిక్రమిస్తూ డ్రోన్‌కెమెరా ఉపయోగించిన కేసులో రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిఆర్‌ఎస్ లోక్‌సభపక్ష నేత నామానాగేశ్వరరావు పార్లమెంట్‌లో తేల్చిచెప్పిన విషయం విదితమే. రాష్ట్రంలో ఒకవైపు భూకబ్జాలకు పాల్పడుతూ మరోవైపు సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ఇటు టిఆర్‌ఎస్ నేతలతో పాటు అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని సంప్రదించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న రేవంత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్వంత పార్టీ నేతలు స్వరం వినిపిస్తున్నారు. ఈక్రమంలో రేవంత్‌రెడ్డి తనపై కేసులను పరిష్కరించుకోవాలని, ఇందులో పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందిచకూడదని పార్టీలోని సీనియర్ నేతలు తేల్చి చెబుతున్నారు.
రేవంతుని కేసుల తంతు:
రేవంత్‌రెడ్డిపై గతంలో జూబ్ల్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఫోర్జరీ చీటింగ్ కేసులు, టెస్‌పాస్, వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు సంబంధిన కేసులున్న విషయం తెలిసిందే. అలాగే ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనపై 7 కేసులు, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘనపై మరో కేసు, కొడంగల్‌లో 9, సైఫాబాద్ 10, గచ్చిబౌలి 4, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్3, అబిడ్స్ 3, సుల్తాన్‌బజార్ 3, మద్దూర్ 3, పంజాగుట్ట 3, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులు సైతం విచారణ దశకు చేరుకున్నాయి. అదేవిధంగా ఆర్‌ఒసి, సిబిఐలతో పాటు ఎన్నికల కమిషన్‌వద్ద పలు కేసులుపెండింగ్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాలు వివరిస్తున్నాయి. వీటితో పాటు ఓటుకు నోటు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసులు ప్రస్తుతం విచారణలో విచారణ ఉన్నాయి. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రేవంత్‌పై 32కేసులు నమోదయ్యాయి.తాజాగా వచ్చినగోపనపల్లి భూకబ్జా కేసులో అనేక అక్రమాలతో పాటు వాటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమైన విషయం తెలిసిందే. రేవంత్‌పై నమోదైన కొన్ని కీలక కేసులకు సంబంధించి పిటి వారెంట్లు జారీ అయినట్లు సమాచారం. రేవంత్ బెయిల్‌పై విడుదలైన వెంటనే వాటిపై విచారణ వేగవంతం చేసేందుకు విచారణాధికారులు సమాయత్తమౌతున్నారు.

High Court Dismissed Revanth Reddy Bail Petition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News