Sunday, May 5, 2024

ఇళ్ల మధ్య ‘పబ్బు’లేంటి?

- Advertisement -
- Advertisement -

వాటి శబ్ధ కాలుష్యంపై హైకోర్టు సీరియస్ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు
ఎలాంటి సౌండ్ సిస్టమ్స్ పెట్టొద్దు రాత్రి పూట లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని జనావాసాల మధ్య పబ్‌ల నిర్వహణ అంశంపై హైకోర్టు విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. డిజె సౌండ్‌లు, మితిమీరిన సౌండ్ తో నృత్యాల వల్ల చుట్టుపక్కలవాళ్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని గతంలో అనేక సందర్భాల్లో స్థానిక పోలీసుల నుంచి డిజిపి, ప్రభుత్వానికి అనే క ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఈక్రమంలో జనావాసాల సమీపంలో ఉండే పబ్‌లలో ధ్వని నిబంధన ఉల్లంఘించిన పబ్‌లపై నమోదైన కేసుల గురించి ఆరా తీసింది. ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. నివేదిక సమర్పించాలంటూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నగర పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. పబ్‌లలో మ్యూజిక్, డ్యాన్సులకు అనుమతుల గురించి తెలపాలని సూచించిం ది. పబ్‌లకు లైసెన్స్ మంజూరు చేసేటప్పుడు పరిగణించిన అంశాలేంటో తెలపాలని జిహెచ్‌ఎంసికి ఆదేశించింది.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకు న్న న్యాయస్థానం దీనిపై వివరాలు కోరుతూ నగరంలోని పబ్స్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చే సింది. ఇప్పటి నుంచి నుంచి రాత్రి 10 దాటితే పబ్స్‌లో ఎలాంటి సౌండ్ పెట్టరాదని హైకోర్టు సూ చించింది. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 6 వరకు ఎలాంటి సౌండ్ పెట్టొద్దని ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని హైకోర్టు పేర్కొంది. రాత్రి వేళల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదని పేర్కొంది. ఇళ్లు, విద్యాసంస్థలున్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారు? అని కోర్టు పేర్కొంది. ఏ అంశాలను పరిగణించి పబ్‌లకు అనుమతులిచ్చారో చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశించింది. అలాగే పబ్‌లో రాత్రిపూట లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని సూచించింది. ఇటీవల టాట్ పబ్ విషయపై హైకోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరుపున హైకోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. ఈ నేపథ్యంలో పబ్‌లపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలంటూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News