Saturday, April 27, 2024

సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఇ బైక్ షోరూంలో దుర్ఘటన
పై అంతస్తులోని హోటల్‌కు
వ్యాపించిన మంటలు
అపస్మారక స్థితిలో ఉన్న
8మందిని రక్షించిన పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఇ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో సోమవా రం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో బైక్ షోరూం పైనే ఉన్న రూబీ హో టల్‌పైకి మంటలు ఎగిసిపడటంతో అపస్మారక స్థితిలో చేరుకున్న ఎనిమిది మందిని పోలీసులు వైద్య సేవల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో రూబీ హోటల్‌లో దట్టమైన పొగలు అలముకోవడంతో అందులో నుంచి 10మంది పైపులు పట్టుకుని సురక్షితంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకోగా మరో ఇద్దరు పై నుంచి కిందకు దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే…సికిందరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలోని సెల్లార్‌లో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్‌లో ఉన్న టూరిస్టులు చిక్కుకుపోయారని స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

రూబీ హోటల్‌లో చిక్కుకున్న సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక, పోలీసు సిబ్బందితో పాటు స్థానికులు హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో అపస్మార స్థితిలో ఉన్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చారు. అలాగే మరోవైపు అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కాగా ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో మంటలు చెలరేగడం, షోరూంలో బైకుల బ్యాటరీలు పెద్ద శబ్దాలు చేస్తూ పేలుతుండటంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ ప్రమాదంతో ఎలక్ట్రిక్ బైకులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. రూబీ హోటల్‌లో దట్టంగా పొగలు అలుముకోవడంతో పై అంతస్తుకు వెళ్లేందుకు ఒకే దారి ఉండటంతో అగ్నిమాపక, పోలీసు సిబ్బంది లోపలి వెళ్లేందుకు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.

క్షతగాత్రులను ఆదుకుంటాం : మంత్రి శ్రీనివాసయాదవ్

సికింద్రాబాద్‌లోని ఇ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే మంత్రి శ్రీనివాసయాదవ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాద సమయంలో రూబీ హోటల్‌లో 25మంది ఉన్నారని, ప్రమాదంలో గాయపడిన వారిలో 5గురిని యశోద, మరో ఎనిమిది మందిని గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News