Monday, April 29, 2024

ఆర్‌ఎంపి, పిఎంపిలకు శిక్షణపై హైకోర్టు కీలక ఆదేశం

- Advertisement -
- Advertisement -

High Court key order on training for RMPs and PMPs

 

హైదరాబాద్ : తమకు పారామెడిక్స్ శిక్షణ ఇవ్వాలన్న సామాజిక వైద్యుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను హైకోర్టు శనివారం నాడు ఆదేశించింది. పారామెడిక్స్ శిక్షణ ఇవ్వాలని 2015లో ప్రభుత్వం జారీ చేసిన జివొ 428ని అమలు చేయాలని ఆర్‌ఎంపి, పిఎంపిల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకన్న జూన్ 5న వైద్యారోగ్య శాఖకు వినతిపత్రం సమర్పించారు. శిక్షణ కోసం ఇప్పటికే రాష్ట్ర పారామెడికల్ బోర్డుకు ఒక్కొక్కరు రూ. 200 రూపాయలు చెల్లించి నమోదు చేసుకున్నట్లు వివరించారు. అయితే తమ వినతిపత్రంపై వైద్యారోగ్య శాఖ స్పందించడం లేదంటూ వెంకన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్‌ఎంపి, పిఎంపిల సంక్షేమ సంఘం వినతిని వీలైనంత త్వరగా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌లోని అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, ఈక్రమంలో చట్టానికి అనుగుణంగా వారి వినతిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ కోర్టు విచారణ ముగించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News