Friday, May 3, 2024

నటుడు అజిత్ ఇంటి ముందు మహిళ హైడ్రామా

- Advertisement -
- Advertisement -

Ajit

చెన్నై: తమిళ సినీ నటుడు అజిత్ ఇంటి ముందు ఓ మహిళ చచ్చిపోతానంటూ హై డ్రామా చేసింది. అజిత్ వల్లే తన ఉద్యోగం ఊడిందంటూ ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. అయితే పోలీసులు సకాలంలో ఆమెను అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే…ఫర్జానా అనే మహిళ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. గత సంవత్సరం అజిత్ తన భార్య షాలినితో కలిసి హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ఆమె అతడితో ఫోటోలు తీసుకుంది. వాటిని సోషల్ మీడియాలో ఆమె పెట్టడంతో హాస్పిటల్ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దాంతో ఆమె అజిత్ వల్లే తన ఉద్యోగం పోయిందంటూ, అజిత్ కనుక ఒక్కసారి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే తనకు తిరిగి ఉద్యోగం వస్తుందంటూ ఆమె రచ్చ చేసింది. అతడిని చాలాసార్లు కలిసే ప్రయత్నంచేసినా అతడు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దాంతో ఆమె చేసేది లేక అతడి ఇంటి ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కానీ పోలీసులు సకాలంలో చేరి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News