Sunday, April 28, 2024

రూ.15 పెరిగిన వంటగ్యాస్ ధర

- Advertisement -
- Advertisement -
Cooking gas price increased by Rs 15
పెట్రోల్ 30, డీజిల్ 35 పైసలపెంపు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఇంధనం కంపెనీలు వంటగ్యాస్(ఎల్‌పిజి) సిలిండర్ ధరను రూ.15మేర పెంచాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ 14.2 కిలోల ధరను రూ.15 మేర పెంచాయి. దీంతో, సిలిండర్ ధర ఢిల్లీలో,ముంబయిలో రూ.899.50కి చేరింది. కోల్‌కతాలో రూ.926కు చేరింది. జులై నుంచి ఇప్పటివరకు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.90 పెరిగాయి. సిలిండర్ ధర జులైలో రూ.25.50, ఆగస్టు17న రూ.25, సెప్టెంబర్ 1న రూ.25 వంతున పెరిగింది. సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి కుటుంబానికి 12 వరకు ఇస్తుండగా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని క్రమక్రమంగా తగ్గించివేస్తున్నారు. 5 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.502కు చేరింది.

మరోవైపు చమురు కంపెనీలు వరుసగా ఆరోరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. బుధవారం లీటర్ పెట్రోల్ ధరను 30 పైసలు, డీజిల్ ధరను 35 పైసలు పెంచాయి. దీంతో, లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.102.94కి, ముంబయిలో రూ.108.96కి చేరింది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.91.42కు, ముంబయిలో రూ.99.17కి చేరింది. సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ ధర 2.89 పైసలు, పెట్రోల్ ధర 1.75 పైసలు పెరిగింది. డీజిల్ ధర మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రూ.100 మార్క్ దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 82.92 డాలర్లకు చేరింది. ఇది ఏడేళ్ల గరిష్ఠం. నెల రోజుల క్రితం ఇది 72 డాలర్లుగా ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News