Sunday, May 5, 2024

‘దేవర’గుట్టపై ఆరా

- Advertisement -
- Advertisement -

ఆలయభూముల అన్యాక్రాంతంపై విచారణ ముమ్మరం

భారీ ఎత్తున నిర్మించిన గోదాములు, ఫౌల్ట్రీ ఫారాలు, ఫౌంహౌస్‌ల పరిశీలన
బ్యాంకుల ద్వారా పొందిన రుణాలు, నిర్మాణ అనుమతులపై దర్యాప్తు
ఈటల సతీమణి పేరిట ఉన్న గోదాముల వివరాల సేకరణ
శ్రీసీతారామస్వామి ఆలయ సందర్శన, రికార్డుల స్వాధీనం
దేవరయాంజల్ భూములపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న ఐఎఎస్ అధికారుల కమిటీ

మన తెలంగాణ/మేడ్చల్: దేవరయాంజాల్ ఆలయ భూములపై ఉన్నత స్థాయి కమిటీ మంగళవారం రెండో రోజు విచారణ కొనసాగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్‌రావు నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల బృదం, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు ఆలయ భూములపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. నాలుగు బృందాలుగా విడిపోయిన అధికారులు ఆలయ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపారు. కమిటీ చైర్మన్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు, సభ్యులు శ్వేతా మహంతి, భారతి హోళీకేరి, ప్రశాంత్ జీవన్ పాటిల్ బృదం దేవరయాంజాల్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున పేరిట ఉన్న గోదాములను పరిశీలించి వివరాలు సేకరించారు. 1,425 ఎకరాల దేవరయాంజాల్ శ్రీ సీతారామ స్వామి ఆలయ భూములలో భారీ ఎత్తున చేపట్టిన గోదాంలు, ఫౌల్టీ ఫారాలు, ఫాంహౌస్‌ల నిర్మాణాలు, వీటికి బ్యాంకుల ద్వారా పొందిన రుణాలపై ఆరా తీశారు. భూముల రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై ఉన్నతాధికారుల బృందం విచారణ జరిపింది. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు శ్రీ సీతారామ స్వామి ఆలయాన్ని సందర్శించారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, అర్చకులను, పలువురు గ్రామస్తులను విచారించి వందల ఎకరాల ఆలయ భూములు ఏ విధంగా రికార్డులు మారాయనే విషయాలపై ఆరా తీసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ భూముల అన్యాక్రాంతంపై మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు.

High Level Panel starts probe into Devaryamjal Lands

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News