Monday, April 29, 2024

నిప్పుల వాన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : భానుడు భగభగ మండాడు. రాష్ట్రం ఆదివారం నాడు నిప్పుల కుంపటిగా మారింది. మాడు పగిలే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఉ ష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువయ్యా యి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్‌లో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఇదే జిల్లాలోని జన్నారంలో 45.8 డిగ్రీలు, కవ్వాల్ పులుల సంరక్షణ అభయారణ్యం ప్రాంతంలో 45.6 డిగ్రీలు న మోదయ్యాయి. వేమనపల్లి మండలం నీల్వాయిలో 45.5 డిగ్రీలు, ధర్మపురి మండలం జైనాలో 45.5డిగ్రీలు, కొమురం భీం జిల్లా కెరిమెరలో 45.4, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.4, నిజామాబాద్ జిల్లా ముప్కల్‌లో 45.1, నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జుర్‌లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 11గంటలకే భానుడు సెగలు కక్కుతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. యంత్రం 4గంటల వరకూ వడగాల్పుల తీవ్రత తగ్గడం లేదు. ప్రధా న నగరాలు, పట్టణాల్లో ఎండల ధాటికి జనసంచారం పలుచబడుతోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫూ పరిస్థితులను తలపిస్తున్నాయి. ఎండల తీవ్రత దృష్టా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు చేస్తున్నారు.

చిన్న పిల్లలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. గర్బిణులు కూడా అధిక ఉష్ణోగ్రతలకు దూరం గా ఉండాలని సూచిస్తున్నారు. మొన్నటిదాకా అకాల వర్షాలతో వణికిపోయిన వ్యవసాయరం గం ఎండల తీవ్రతకు జడుసుకుంటోంది. ఆరుబయలు పంట పొలాల్లో మధ్యాహ్నం ఎండధాటికి తాళలేక రైతులు, కూలీలు చెట్ల నీడకు పరుగులు తీయాల్సి మరోవైపు వడగాడ్పుల తీవ్రత కూడ పెరగడంతో ఉపాధి హామీ పథకం కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండల ధాటికి కొద్దిసేపటికే కూలీ లు అలసిపోతున్నారు. పని ఉత్పదాకతపై పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావం పడుతోంది. హామీ పనులు లక్షం మేరకు ముందుకు సాగ డం లేదంటున్నారు.

మరో మూడు రోజులు ఇదే పరిస్థితి
దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుం చి తెలంగాణ రాష్ట్రం వీస్తున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశా లు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా ఉష్ణోగ్రతలు 35డిగ్రీల లోపు ఉంటే గ్రీన్‌జోన్‌లో ఉన్నట్టు భావిస్తారు.

ఈ జోన్‌లో ఉన్న ప్రాంతాలకు ఎటువంటి హెచ్చరికలు ఉండవు. మధ్యలో ఉంటే పరిశీలన కింద ఎల్లో జాబితాలోకి చేరుస్తారు. జోన్‌లో ఉన్న ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. 41 45 హూదెగీల మధ్యలో ఉంటే ఈ ప్రాంతాలను ఆరెంజ్ జాబితాలోకి చేరుస్తారు. ఈ జోన్‌లో ఉన్న ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు. 45 హూగీలు దాటితే వార్నింగ్ ఇస్తూ రెడ్ జోన్‌లో చేరుస్తారు. ఆదివారం నాటి ఎండల తీవ్రతను గమనిస్తే 45డిగ్రీల ఉష్ణోగ్రతలను దాటేసి మంచిర్యాల , జగిత్యాల, కొమురం భీం, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలు రెడ్ జోన్‌లోకి చేరాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, అదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలు ఆరెంజ్ జోన్‌లోకి చేరాయ. అతి తక్కువగా 40.9డిగ్రీల ఉష్ణోగ్రతలతో వనపర్తి, 40.1డిగ్రీల ఉష్ణోగ్రతలతో జోగులాంబ గద్వాల జిల్లాలు ఎల్లో జోన్‌లో చేరాయి. జిల్లాలు 41 45 మధ్య ఉంటూ ఆరెంజ్ జోన్‌లో చేరాయి.

గ్రేటర్ పరిధిలో 42.1డిగ్రీలు
కాంక్రిట్ జంగిల్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆదివా రం 42.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం నెలకొంది. మేడ్చల్ మల్కాజిగిరిలో 41.8, మెదక్‌లో 41.5, రంగారెడ్డి జిల్లా లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News