Saturday, April 27, 2024

ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడులు

- Advertisement -
- Advertisement -

ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి శరత్

అక్కన్నపేట: ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి శంకర్ అన్నారు. శనివారం అక్కన్నపే ట మండల రామవరం గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి సిందుజ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగును విధివిరిగా వేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం వేస్తున్న పంటల కన్న ఆ యిల్ పామ్ సాగు వేస్తే చాలా మేలని వేసిన నాలుగు సంవత్సరాల నుండి దిగుబడులు ఉంటాయని అన్నారు. మూడు సంవత్సరాల వరకు కూడా ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంటలు కూడావేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయి ల్ ఫామ్ సాగుకు సబ్సీడిని అందజేస్తూ రైతులకు భరోసాగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు సబ్సీడిని వినియోగించుకొని ఆయిల్ పామ్‌కు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఆఫీసర్ రవళి, ఎంపిటిసి లింగాల శ్రీనివాస్, రైతుబందు సమితి కో ఆర్డీనేటర్ ప్రతాపరెడ్డి, రైతులు సాదు ప్రతాపరెడ్డి, రాజిరెడ్డి, నర్సిరెడ్డి, రాజయ్య, సంపత్ రెడ్డి, రాకేశ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News