Wednesday, May 8, 2024

చారిత్రాత్మక నిలువురాళ్ల అభివృద్ధికి కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -

త్వరలో ముడిమాల్లో పర్యటిస్తా
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వినతిపై
స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: చారిత్రాత్మక నిలువురాళ్ల అభివృద్ధికి, యునెస్కో చారిత్రాత్మక స్థలం గుర్తింపు కోసం చేస్తున్న కృషిలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల కలిసి వినతిపత్రం అందజేశారు. నిలువురాళ్లకు యునెస్కో అంతర్జాతీయ స్థలాల జాబితాలో చేర్చడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటుగా తాము క్షేత్రస్థాయిలో ఇటీవల అధ్యయనం చేసిన వివరాలను సందీప్ మక్తాల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సమర్పించారు. సందీప్ మక్తాల నాయకత్వంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన తీరును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు దక్కేలా ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తామని సందీప్ మక్తాల బృందానికి మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే పురావస్తు శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
నిలువురాళ్ల ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తేవడం, పర్యాటకంగా అభివృద్ధి వైపు ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా ఇటీవల టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల సారథ్యంలోని బృందం అక్కడ పర్యటించి పరిశోధకులు మరియు స్థానికులతో అనేక వివరాలు సేకరించింది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో సందీప్ మక్తాల కలిసి వినతిపత్రం అందించారు. యునెస్కో చారిత్రక స్థలంగా నిలువురాళ్లకు గుర్తింపుతో టూరిజం పెరుగుతుందని సందీప్ మక్తాల వివరించారు. ఈ గుర్తింపుతో ఎందరో విదేశీయులు నిలువురాళ్ల గురించి తెలుసుకునేందుకు, ఈ ప్రాంతానికి వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు.

స్థానికులకు ఉపాధి పొందడంతో పాటు, రియల్ ఎస్టేట్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. త్రీడీ టెక్నాలజీ ఆధారంగా నిలువురాళ్లకు ప్రాచుర్యం దక్కేలా చేయనున్నట్లు సందీప్ మక్తాల వివరించారు. టీటా ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వివరించిన అంశాల పట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఇంత కృషి చేసినందుకు ఆయన ఆ బృందాన్ని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేసి యునెస్కో గుర్తింపు దక్కేలా ప్రయత్నించనున్నట్లు హామీ ఇచ్చారు. సందీప్ మక్తాల పేర్కొన్న అంశాలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు త్వరలోనే ముడిమాల్లో పర్యటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆర్కియాలజీ అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి నిలువురాళ్లకు ప్రాచుర్యం దక్కేలా కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో జై మఖ్తల్ విద్యార్థి విభాగం నాయకులు నందిని, అనిల్, శ్రావణి, సుష్మా, వినయ్, రాకేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News