Sunday, May 19, 2024

‘హిట్ 2’ షురూ

- Advertisement -
- Advertisement -

'HIT 2' Movie Launch by Hero Nani

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి, కొత్త కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి తొలి చిత్రంగా ‘అ!’ సినిమాను రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. రెండో చిత్రంగా ‘హిట్’ అనే సీట్ థ్రిల్లర్‌ను రూపొందించి సూపర్ డూపర్ హిట్ సాధించారు. ఇప్పుడు ‘హిట్ 2’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ‘ది సెకండ్ కేస్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ‘హిట్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. ముహుర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శైలేష్‌కు అందించారు. నిర్మాత ప్రశాంతి త్రిపిరినేని కెమెరా స్విచాన్ చేశారు.

ఇక హీరో అడివిశేష్… కృష్ణ దేవ్ అలియాస్ కె.డి పాత్రలో నటిస్తున్న ’హిట్ 2’ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో ‘హిట్’ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. అడివిశేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించే ఈ సినిమాకు ఆర్ట్: మనీషా ఎ.దత్,ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్.

‘HIT 2’ Movie Launch by Hero Nani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News