Tuesday, May 21, 2024

‘గ్లింప్స్ ఆఫ్ కేడీ’

- Advertisement -
- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ‘హిట్’. మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘హిట్ 2’ గా ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. ఇది కూడా ఓ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్‌పై సాగుతుంది. సెకండ్ కేస్ ఫ్రమ్ ‘హిట్’ అనే క్యాప్షన్‌తో సినిమాను ప్రచారం చేస్తున్నారు. అయితే మొదటి భాగానికి, దీనికి తేడా ఏంటంటే.. ఇందులో అడివి శేష్‌తో పాటు ఒక జెర్మన్ షెఫర్డ్ డాగ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ‘గ్లింప్స్ ఆఫ్ కేడీ’ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది. వచ్చే ఏడాది ‘హిట్ 2’ విడుదల కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News