Wednesday, May 1, 2024

యువ క్రికెటర్లకు రోహిత్ చిట్కాలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇక్కడ జాతీయ క్రికెట్ అకాడమీలో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ అవతారమెత్తాడు. కాగా, గాయంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ ఆసియా అండర్19 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న భారత యువ జట్టుకు క్రికెట్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చాడు. బ్యాటింగ్ ఎలా చేయాలి, ఒత్తిడి సమయంలో ఎలా ముందుకు సాగాలి తదితర అంశాల గురించి యువ ఆటగాళ్లకు చిట్కాలు చెప్పాడు. రోహిత్ వంటి ఎంతో అనుభవజ్ఞుడైన క్రికెటర్ నుంచి సలహాలు, సూచనలు అందడంతో యువ క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Rohit Sharma Addresses India U-19 Team at NCA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News