Friday, April 26, 2024

గురువే పశువు!

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు చిన్నారి విద్యార్థినులపై హెచ్‌ఎం అతాచారం

లక్ష్మీదేవీపల్లి మండలం మైలారం పంచాయతీలోని చింతవర్రే ప్రాథమిక పాఠశాలలో అమానుషం
ఆన్‌లైన్ క్లాసుల పేరుతో రప్పించి స్కూల్‌లోనే రోజుకి ఒక్కో బాలికపై అఘాయిత్యం
అనారోగ్యానికి గురైన బాలికలు, రెండో తరగతి విద్యార్థినికి తీవ్ర అస్వస్థత, విషయం తెలిసి దేహశుద్ధి చేసిన తలిదండ్రులు వీడియో బయటపడడంతో అధికారుల రంగప్రవేశం
పొక్సో, నిర్భయ చట్టాల కింద కేసు

 

మన తెలంగాణ/ కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలంలోని మైలారం పంచాయతీలోని చింతవర్రే ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం స్కూల్లో చదువుకుంటున్న అయిదుగురు చి న్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన అమానుష ఉదంతం బయటపడింది. పిల్లలు బయటికి చెప్పుకోలేక, అనారోగ్యంతో కునారిల్లుతు ంటే అంతుబట్టక అమాయకులైన ఆ తల్లితండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎట్టకేలకు తమ బిడ్డల రోదనలకు, రోగానికి ఓ ఉపాధ్యాయుడి పశు త్వం కారణమని తెలిసి అవాక్కయ్యారు. తమ జాతికే చెందిన ఒక ఉపాధ్యాయుడు ఇలా తమ పిల్లలను చెరబడతాడని ఊహించని ఆ తల్లి తండ్రులు విషయం తెలుసుకుని ఆగ్రహోదగ్రులయ్యారు. సోమవారం పంచాయతీ చేసేందుకు వచ్చిన మరో హెచ్ ఎం, సుమారు 20 మంది ఉపాధ్యాయుల సమక్షంలో ఆ టీచర్‌కు దేహశుద్ధ్ది చేశారు.

ఈ వీడియో బయట పడడంతో అసలు విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్, ఎంపిడివో, సిఐ, ఎస్‌ఐ, ఆ ఊరిని సందర్శించారు. చింతవర్రె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొడ్డసునీల్ రోజూ కొత్తగూడెం సమీపంలోని లక్ష్మీదేవిపల్లి నుంచి చింతవర్రేకు వచ్చి ఉద్యోగం చేసి వెళుతుంటాడు. దినం తప్పి దినం వస్తుంటాడు. తల్లి తండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవటంతో ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థ్ధినిలను పాఠశాలకు పిలిపించేవాడు. ఇలా రోజుకు ఒక బాలికపై అత్యాచారం చేశాడు. తన స్మార్ట్ ఫోన్‌లో వారికి బూతు బొమ్మలు చూపించేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. పిల్లలు బెదిరిపోయారు. ఆ ఉపాధ్యాయుడు వచ్చిన రోజున ఆన్‌లైన్ క్లాసులకు వెళ్లేందుకు భయపడేవారు. ఇలా అతని చేతిలో అత్యాచారానికి గురైన విద్యార్థ్ధినులలో రెండు, మూడు, నాలుగు తరగుతలకు చెందిన వారున్నారు. రెండో తరగతి చదువుతున్న విద్యార్థ్ధి(7)ని పరిస్థితి బాగాలేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.

ఆమె తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో, నిర్భయ చట్టాల కింద చుంచుపల్లి సిఐ గురుస్వామి ఆధ్వర్యంలో ఎస్‌ఐ అంజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి మిగతా వివరాలు దర్యాప్తులో కేసులో జతచేసే అవకాశం ఉంది. ఆ విద్యార్థ్ధినిని పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ భద్రకాళి, ఎంపిడివో రామారావు, ఐసిడిఎస్ సిడిపివో కనకదుర్గ గ్రామానికి వెళ్లి విద్యార్థ్ధినుల తల్లి తండ్రులను విచారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. సంఘటన మొన్ననే అక్కడి అంగన్‌వాడి టీచర్ దృష్టికి వచ్చిందని సమాచారం. అయినా ఆమె ఎవరికి చెప్పలేదు. మైలారం హెచ్‌ఎం ఆధ్వర్యంలో సుమారు20మంది చింతవర్రె గ్రామానికి వెళ్లి కేసు లేకుండా చేసేందుకు సోమవారం ప్రయత్నాలు చేశారు. తెల్లకాగితాలపై విద్యారినుల తల్లి తండ్రులతో సంతకాలు పెట్టించుకున్నారని సమాచారం. కేసు లేకుండా చేసేందుకు పంచాయతి చేసిన ఉపాధ్యాయులపై కూడా కేసు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటనను సదరు ఉపాధ్యాయుడి వైఖరిని ఖండించకుండా అతనికి మద్దతుగా వెళ్లటం గ్రామస్తులు, తల్లితండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయటం పట్ల పలువురు తీవ్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News