Saturday, April 27, 2024

ఓ హానెస్ట్ థ్రిల్లర్ ‘హిట్’

- Advertisement -
- Advertisement -

Hit movie

 

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై విశ్వక్‌సేన్ హీరోగా రూపొందిన చిత్రం ‘హిట్’. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపిఎస్ ఆఫీసర్‌గా విశ్వక్‌సేన్ కనిపించనున్నారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత నాని మాట్లాడుతూ “శైలేష్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా కోసం నిర్మాతగా మారాను. అందరం కలిసి విశ్వక్ అయితే ఈ సినిమాకు న్యాయం చేస్తాడని భావించాం. ఈ సినిమా హిట్ అయితే మా బ్యానర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే నిర్మిస్తాం.

అందరికీ నచ్చే సినిమా ఇదవుతుంది”అని అన్నారు. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ “ఓ హానెస్ట్ థ్రిల్లర్ ‘హిట్’. నిర్మాత నాని ఈ కథకు ఏది అవసరమో దాన్ని అందించారు”అని తెలిపారు. హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ “ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటామన్న నమ్మకముంది. హీరోగా నాకు మంచి పేరు తెచ్చే చిత్రమిది”అని పేర్కొన్నారు. హీరోయిన్ రుహానీ శర్మ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా”అని అన్నారు. ఈ సమావేశంలో నిర్మాత ప్రశాంతి త్రిపిర్‌నేని పాల్గొన్నారు.

Honest Thriller movie Hit
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News