Friday, May 3, 2024

హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి

- Advertisement -
- Advertisement -

జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
రాష్ట్ర సోషలిస్టు విద్యార్థి సంఘం సమావేశం డిమాండ్

BC Mess charges increased in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలు,- గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర సోషలిస్టు విద్యార్థి సంఘం సమావేశం డిమాండ్ చేసింది. నగరంలో మంగళవారం జరిగిన సమావేశానికి సోషలిస్టు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెల్ల మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాటాల్డుతూ గడిచిన ఐదేళ్లగా రాష్ట్రంలో మెస్ ఛార్జీలు, విద్యార్థుల ఉపకార వేతనాలు పెంచలేదన్నారు. పెరిగిన ధరల దృష్టా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో విద్యార్థులు పలు డిమాండ్లను ప్రస్తావించారు. ప్రధానంగా మెస్ ఛార్జీల పెంపు, హాస్టల్, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని,ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

అన్ని విభాగాల సంక్షేమ హాస్టళ్లను ఒకే ప్రాతిపదికన నడిపించి ఎస్‌సిలో ఉన్న ఈ-పాస్ విధానం తొలగించాలని కోరారు. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు ప్రత్యేక డిజిటల్ లైబ్రరి, కంప్యూటర్ ల్యాబ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్ ప్రతి హాస్టల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట చేపడుతామని విద్యార్థులు తెలిపారు. అనంతరం బిసి సంఘాల ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, G.కృష్ణ యాదవ్, పగిల్ల సతీష్, చంటి ముదిరాజ్, రఘు, భాస్కర్ ప్రజాపతి ప్రసంగించారు.ఈ సమావేశంలో నక్క మహేష్, డి.సత్యనారాయణ, ప్రశాంత్, జి.సతీష్ బహుజన్, అనిల్ కుమార్, బెజవాడ వెంకట్రావ్, నాగార్జున, గురుమూర్తి, జగన్, కట్ట అనిల్, కళ్యాణ్, సునీల్, నిజామాబాదు భరత్, మహేష్, కుమార్, అరవింద్, గోపికృష్ణ, చిన్న, జి రవికుమార్, యం.నితిన్, అజయ్‌కుమార్, నరేష్ , చింటూ, ఝాన్సీ, స్వాతి, శివాని, మనీష, ఐశ్వర్య, ఫర్జానా, రేగుల్ల అన్నపూర్ణ, మౌనిక, సునంద, శ్వేత, మానస, యo. అఖిల, ఇ.రమ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News