Tuesday, April 30, 2024

ఉచిత నీటి పథకం నమోదుకు గృహ యజమానుల వీడని నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

నెలాఖరులోగా అనుసంధానం చేసు కోవాలని సూచించినా పట్టించుకోని వైనం
13 బిల్లులు కట్టాల్సి వస్తుందని హెచ్చరించినా సహకరించన పరిస్థ్దితి
ఇప్పటి వరకు 50శాతం గృహ వినియోగదారులు ఆధార్ నమోదు
మిగతా వారు చేసుకునేందుకు పెద్ద ఎత్తున జలమండలి ప్రచారం

House owners are reluctant to register for a free water scheme

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ప్రజలు ఉచిత మంచినీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జలమండలి సూచించిన గృహా యాజమానులు నిర్లక్షం వహిస్తున్నారని స్థానిక బోర్డు సిబ్బంది పేర్కొంటున్నారు. ఈనెలాఖరు వరకు గడువు ఉండటంతో లైన్‌మెన్లు ఇంటింటికి తిరిగి వీలైనంత త్వరగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని చెప్పిన రేపోమా పు చూద్దామని సమాధానం ఇస్తున్నట్లు చెబుతున్నారు. గత 13 నెలల కితం ఉచితనీటి పథకం ప్రారంభిస్తే ఇప్పటి వరకు 57శాతం కనెక్షన్లు మాత్రమే ఆధార్ చేసుకుని మీటర్లు బిగించుకున్నట్లు, మిగతా వారు ప్ర భుత్వం ఎన్నికల్లో ఉచితంగా నీటి సరఫరా చేస్తామని ప్రకటన చేసింది. ఇంకా మీటర్లు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వారికి అవగాహన చేసేందుకు గత మూడు రోజుల నుంచి మేసేజ్‌లు, టివిలు, రేడియో, కరపత్రాలు, సామాజిక ఉద్యమాల ద్వారా ప్రచారం చేపడుతున్నారు. ప్రతి కనెక్షన్‌కు ఆధార్ అనుసంధానం చేస్తేనే పథకానికి అర్హులని తమకేమి పట్టనట్లుగా ఉంటే గత 13 నెలల బిల్లులు కట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు తమ ప్యాన్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానంతో పాటు ఖచ్చితంగా కనెక్షన్లకు పని చేస్తున్న మీటరు ఉండాలని, ఒక వేళ మీటరు లేకుంటే ఏర్పాటు చేసుకుని సమీప జలమండలి అధికారులు వివరాలు అందజేయాలి సూచిస్తున్నారు. ఇంకా 4.30 లక్షలమంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవాల్సి ఉంది. వారికోసం ప్రభుత్వం ఈనెల 31వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. గడువులోగా సుమారు 80 వేల మంది వినియోగదారులు ఈపథకం కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందని జలమండలి భావిస్తుంది. నమోదు చేసుకోని వారికి మాత్రం 2020 డిసెంబర్ నుంచే బి ల్లు జారీ చేస్తామని, వీరికి ఎటువంటి రాయితీలు ఉండవని తెలిపారు.

అయితే ఈ బిల్లుపై పెనాల్టీ, వడ్డీ మాత్రం విధించబోమని, నాలుగు వాయిదాల్లో ఈబిల్లును చెల్లించే వెసులుబాటును వినియోగదారులకు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 31లోగా ఉచిత పథకానికి నమోదు చేసుకోని వారికి గడువు ముగిసిన తరువాత కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని, అయితే నమోదు చేసుకున్న నాటి నుంచే వీరు ఉచిత 20వేల లీటర్ల నీటి పథకానికి అర్హులు అవుతారని, అప్పటివరకు బిల్లు చెల్లించాల్సిందేనని తెలిపారు. అదే విధంగా స్దానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో వార్డుస్దాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికి జలమండలి సిబ్బంది వెళ్లి ఆదార్ అనుసంధానం చేసే ప్రక్రియను కూడా చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News