Tuesday, April 30, 2024

సౌదీ విమానాశ్రయంపై హోతీయుల దాడి : డ్రోన్లు పేల్చివేత

- Advertisement -
- Advertisement -

Houthi attack on Saudi airport

 

దుబాయ్: యెమెన్‌కు చెందిన హోతీ తిరుగుబాటుదారులు బుధవారం నైరుతి సౌదీ అరేబియా లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేశారు. ఈ దాడిలో తారురోడ్డుపై ఉన్న పౌరవిమానానికి మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక దళాలు వెంటనే రంగం లోకి దిగి మంటలను అదుపు చేశాయి. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. తిరుగుబాటు దారులు విమానాశ్రయం లోపలకు చొచ్చుకు వచ్చి బాంబులు అమర్చిన రెండు డ్రోన్లను పేల్చివేశారని సౌదీ అరేబియా మిలిటరీ సంకీర్ణ అధికార ప్రతినిధి కల్నల్ తుర్కి అల్ మలికి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News