Saturday, April 27, 2024

హౌతీలకు అమెరికా సహా 12 దేశాల హెచ్చరికలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఎర్రసముద్రంలో సరకు రవాణా నౌకలపై తక్షణం దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికాతోసహా మొత్తం 12 దేశాలు హౌతీ రెబెల్స్‌కు హెచ్చరించాయి. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య సాగుతున్న భీకర పోరుకు ప్రతీకారంగా హౌతీ రెబెల్స్ డిసెంబర్ 19 నుంచి ఎర్రసముద్రం నౌకలపై 23 సార్లు దాడులు సాగించారు. ఇరాన్ మద్దతు గల హౌతీలు అమెరికా, దాని మిత్ర దేశాల నుంచి మరోసారి హెచ్చరికలు వచ్చేలా చేయరని భావిస్తున్నట్టు బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం లోని సీనియర్ ఒకరు పేర్కొన్నారు. అయితే హౌతీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆయన వివరించలేదు.

ఈ హెచ్చరికల ప్రకటనపై అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిల్యాండ్, సింగపూర్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేశాయి. “ ఇప్పుడు తమ సందేశం స్పష్టమవుతుందని అనుకుంటున్నాం. ఈ అక్రమ దాడులను తక్షణం ఆపాలి. అలాగే చట్టవిరుద్ధంగా అదుపులో ఉంచిన నౌకలను, నౌకల సిబ్బందిని వెంటనే విడిపించాలి ” అని దేశాలు హెచ్చరించాయి. ఇంకా బెదిరింపులకు పాల్పడితే తీవ్ర పరిణామాలకు హౌతీలు బాధ్యులవుతారు. కీలకమైన సముద్ర మార్గంలో వాణిజ్యం స్వేచ్ఛగా సాగకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిన వారవుతారు అని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News