Monday, April 29, 2024

వేసవి దాహం తీర్చేదెలా?

- Advertisement -
- Advertisement -

డెడ్ స్టోరేజీ చేరువలో రిజర్వాయర్లు

828 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

522 అడుగుల్లో సాగర్.. 154 టిఎంసిల నిల్వ

ఆశలన్నీ ఆల్మట్టివైపే

త్వరలో కర్నాటకతో చర్చలు

మన తెలంగాణ/హైదరాబాద్: వేసవి తాగు నీటి అవసరాలు త రుముకు రాబోతున్నాయి. నుంచి వేసవి కాలం ప్రా రంభం కానుంది. రాష్ట్ర పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులకు చెందిన జలాశయాల్లో నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరువవుతున్నాయి. నీటి రోజరోజుకు తరిగి పోతున్నాయి. కృష్ణా పరీవాహకంగా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల లో ఉన్న నీటితో సాగునీటి అవసరాల మాట అటుంచి వేసవిలో రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చగలమా అన్న సందేహా లు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటినుంచే తాగునీటి అవసరాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని రిజర్వాయర్ల లో ఉన్న నీటి నిల్వలు ఎంత, డెడ్ కింద మిగిలిపోయే నీ టిని మినహాయించి లభ్యత నీరు ఎంత, అందులో తాగునీటి అ వసరాల ఎంత నీరు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి.. ఫిబ్రవరి నుంచి మే నెల వరకూ తాగు నీటి అవసరాలకు ఎంత నీటి కావాలి, రిజర్వార్లలో ఉన్న నీటితో వేసవి అవసరాలు తీర్చగలమా..అన్నదిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. జూన్ వర్షాకాలం ప్రారంభమైనా రుతుపవాల పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. జూన్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాలంటే నెలరోజుల సమయం పట్టిన దాఖాలాలు ఎన్నో ఉన్నాయి. ఎగువన మహారాష్ట్ర, కర్నాటకలో మంచి వర్షాలు కురిసి అక్కడి రిజర్వాయర్లు నిండితేనే దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి వరద చేరుకోవాల్సి ఉంది. అయితే గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే అత్యధికంగా ఆగస్టులోనే ఎగువ కృష్ణా జూరాలను తాకిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్‌నినో వంటి వాటి ప్రభావం పడితే ఆగస్టులోనూ కటకటాలాడాల్సి ముందు జాగ్రత్తగా ఆగస్టు వరకూ రాష్ట్ర పరిధిలోని రిజర్వాయర్లలో నీటిని పోదుపుగా వాడాలంటే ఇప్పటినుంచే తగిన జాగ్రత్త పడాలన్న అభిప్రాయంతో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ కసరత్తులు చేస్తోంది. గోదావరి నదీ సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై పెద్ద భరోసా ఉండేది. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లతో గో దావరి నదీజలాలపై కూడా ఆశలు సన్నగిల్లుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని దిగువకు వదిలేశారు. మేడిగడ్డ బ్యారేజీ గత నెలరోజులుగా ఖాళీగా ఉంది. తాగునీటి అవసరలకు ఇక ఈ బ్యారేజీల్లో చుక్కనీటిని కూడా నిల్వ చేసుకునే అవకాశాల్లేవంటున్నారు. ఎగువన శ్రీపాద ఎల్లంపల్లి , శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఇప్పటినుంచే పొదుపుగా వాడుకుంటూ వేసవి అవసరాలకోసం ముందుజాగ్రత్త పడకపోతే ఉత్తర తెలంగాణ ప్రాంత తాగునీటీ అవసరాలు తీర్చేందుకు ప్రయాస పడాల్సివస్తుందన్న హెచ్చకరికలు నీటిపారుదల రంగం నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఆశలన్నీ ఆల్మట్టిపైనే ..త్వరలో కర్నాటకతో చర్చలు!
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో ఆగస్టు వరకూ తాగునీటి అవసరాలు తీర్చేంతగా నీటి నిలువలు లేవని ఆధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎగువన కర్నాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టులోవున్న నిల్వ నీటిపై ఆశలన్ని పెంచుకోవల్సి వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్ర రిజర్వాయర్లలో వేసవి అవరాలు తీర్చేంతగా నీటి నిల్వలు లేవని , కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కనీసం 10 నుంచి 20 టిఎంసిల నీటినైనా రాష్ట్రానికి విడుదల చేయాలని కోరనున్నట్టు సిఎం వెల్లడించారు. కర్నాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తాగునీటి అవసరాల్లో స్నేహహస్తం అందుతుందన్న విశ్వాసం కూడా బలపడుతోంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని కర్నాకటకు పంపి సిద్ధ రామయ్య చర్చలు జరిపి తాగునీటి విడుదలపై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
శ్రీశైలంలో మిగిలింది 19 టిఎంసిలు మాత్రమే..
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో 802అడుగుల స్థాయికి నీటిమట్టం నుంచి ఆపైన ఉన్న నీటిలో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథాకా ద్వారా ఉపయోగించుకోదగ్గ లభ్యత నీరు కేవలం 19టిఎంసిలు మాత్రమే ఉన్నట్టు అధికారులు లెక్కతేల్చారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, గరిష్ట స్థాయి నీటి నిలువ 215 టిఎంసిలు. సోమవారం నాటిని ఈ ప్రాజెక్టులో నీటిమట్టం 828 అడుగులు ఉండగా , నీటి నిలువ 47టిఎంసిలకు చేరింది. అయితే 802 అడుగుల స్థాయిలో నీటి నిలువ 30టిఎంసిలు ఉంటుందని అందులో తెలంగాణ ఎత్తిపోతల ప్రాజెక్టుల అవసరాలకు 19టిఎంసిలే ఉపయోగపడతాయని లెక్కతేల్చారు. వేసవిలో నీటి ఆవిరి నష్టాలను మినహాయిస్తే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 777అడుగుల మేరకు నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేసుకునే అవకాశం ఉన్నందున ఆ స్థాయిలో 10టిఎంసిలకు మించి నీటి లభ్యత ఉండదని చెబుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 522 అడుగుల నీటిమట్టం స్థాయిలో 154టిఎంసిల నీరు నిలువ ఉంది. సాగర్‌లో 510అడుగుల డెడ్ స్టోరేజీకి ఎగువన కేవలం 12అడుగుల మేరకు మాత్రమే నీరు నిలువ ఉందని అధికారులు వెల్లడించారు.
ఆల్మట్టి తెలంగాణ అవసరాలు తీరుస్తుందా..?
ఆల్మట్టిలో 58టిఎంసిల మేరకు నీటి నిల్వలు ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టులో కూడా 27టిఎంసిల మేరకు నీటి నిలువలు ఉన్నాయి. అయితే ఈ రెండు రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ నీటిని మినహాయిస్తే లభ్యత నీరు కేవలం 48 టిఎంసిలు మాత్రమే ఉన్నట్టు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. కృష్ణానదీ పరీవాహకంగా కర్నాటక ప్రజల తాగునీటి అవసరాల కోసం 37టిఎంసిలను నిలువ చేసుకోవాల్సి ఉందని వివరించారు. ఆల్మట్టి పరీవాహకంగా ప్రస్తుతం సాగులో ఉన్న మిరప పంటను కాపాడుకోకపోతే రూ.2వేల మేరకు రైతులు పంట నష్టపోవాల్సి ఉంటుందని , ఈ పరిస్థితుల్లో మిరప పంటను కాపాడేందకు 2.75 టిఎంసిల నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో తాగునీటి అవసరాలకు నిల్వ చేసిన 37టిఎంసిలను తాకే పరిస్థితి లేదు. మిగిలిన 10టిఎంసిలలో మిరపకు విడుదల చేసే నీటిని మినహాయిస్తే ఇక మిగిలేది 7టిఎంసిలు మాత్రమే, అయితే అందులో తెలంగాణ రాష్ట్ర తాగునీటి అవసరాలకు ఏ మేరకు నీటిని విడుదల చేస్తారన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమర్థత, ప్రభుత్వ చర్చలపైన ఆధారపడి ఉందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News