Sunday, May 5, 2024

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

క‌రీంన‌గ‌ర్: క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ విధించారు. ముందుగా తొలుత 753 పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. అనంత‌రం ఈవీఎంల్లోని ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఒక్కో కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున  2 కేంద్రాల్లో 14 టేబుళ్ల‌పై ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. ఒక్కో రౌండ్‌లో 9వేల నుంచి 10వేల ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ కు 30 నిమిషాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో మొత్తం 2 లక్షల 5వేల 236 ఓట్లు పోలయ్యాయి. హుజూరాబాద్, వీణ‌వంక‌, జ‌మ్మికుంట‌, ఇల్లంతకుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాల‌ వారీగా ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

Huzurabad bypoll vote counting start

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News