Monday, April 29, 2024

మహిళా పోలీసులతో నగర సిపి భేటీ

- Advertisement -
- Advertisement -

Hyderabad CP meet with women police

హైదరాబాద్: నగర పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నగరంలో పనిచేస్తున్న 200 మంది మహిళా పోలీసులతో తన కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. నగరంలో కరోనా వైరస్ కొంత తగ్గుమఖం పడుతోందని తెలిపారు. వైరస్‌వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొత్తగా నియామకమైన పోలీసులు నగరంలో విధుల్లో చేరనున్నారని, వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆధునిక టెక్నాలజీని పోలీసులు అందిపుచ్చుకోవాలని అన్నారు. టెక్నాలజిని ఉపయోగించుకుని చాలా కేసులు పరిష్కరిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో పోలీసింగ్‌లో మరిన్ని మార్పులు తీసుకువస్తామని అన్నారు.

దానికి అనుగుణంగా పోలీసులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మహిళలకు 30శాతం రిజర్వేషన్ ఇస్తున్నారని అన్నారు. బాగా కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పురుషులు, మహిళలకు తేడా లేదని, అందరినీ సమానంగా చూస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పోలీసులకు ఉన్న సౌకర్యాలు మిగతా రాష్ట్రాల్లో లేవని తెలిపారు. ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా తనను సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఎడిసిపి సునీతారెడ్డి, ఇన్స్‌స్పెక్టర లక్ష్మిమాదవి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News