Sunday, May 5, 2024

అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Hyderabad man murder in America

వాషింగ్టన్: అమెరికాలో హైదరాబాద్ వాసి దారుణహత్యకు గురయ్యాడు. భాగ్యనగరంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్ ఆరిఫ్ మోహియుద్ధీన్ అనే వ్యక్తి జార్జియాలో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కొంత మంది దుండగలు ఆరిఫ్‌తో గొడవకు దిగి కత్తులతో పొడిచి పారిపోయారు. స్థానికులు ఆరిఫ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. జార్జియా పోలీసులు ఆరిఫ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అత్యవసర వీసాకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఆరిఫ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అమెరికాలో తమకు బంధువులు లేరని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది ఆరిఫ్‌కు ఫోన్ చేశానని భార్య ఫాతిమా తెలిపింది. 30 నిమిషాల తరువాత కాల్ చేస్తానని చెప్పి ఫోన్ చేయలేదని తన భర్త మరణవార్త భావ ద్వారా తెలిసిందన్నారు. ఆరిఫ్ అంతిమ సంస్కారాలు హాజరయ్యేందుకు ఆయన కుటుంబ సభ్యులకు వీసా ఇప్పించాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో పాటు ఆమెరికా రాయబారి కార్యాలయానికి ఎంబిటి పార్టీ లేఖ రాసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News