Saturday, May 4, 2024

నాలాలో పడి వృద్ధురాలు మృతి

- Advertisement -
- Advertisement -

Old women dead fell into canal in Hyd

హైదరాబాద్: మార్నింగ్ వాకింగ్ వెళ్లిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శారదానగర్‌కు చెందిన సరోజ అనే వృద్ధురాలు(80) వాకింగ్ కోసం సరూర్‌నగర్ చెరువుకట్ట పైకి వెళ్లింది. నడుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు, డిఆర్‌ఎఫ్, పోలీసులు జిహెచ్‌ఎంసి సిబ్బంది అక్కడి చేరుకొని గాలింపు చర్యలు చేపటగా చైతన్యపురిలోని హనుమాన్ నగర్‌లో నాలాలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News