Sunday, April 28, 2024

తెలంగాణ భవన్ లో గ్రేటర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎల భేటీ…

- Advertisement -
- Advertisement -

Hyderabad TRS MLAs meeting in Telangana bhavan

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో గ్రేటర్ సిటీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అత్యవసరంగా సమావేశమయ్యారు. బుధవారం ఉదయం మంత్రులు తలసాని, మహుమూద్ అలీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొని అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుపనున్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి మేయర్, మంత్రి కెటిఆర్ సైతం పాల్గొనే అవకాశం ఉంది. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మేయర్ ఛాంబర్ ను బిజెపి కార్పొరేటర్లు ముట్టడించిన విషయం తెలిసిందే.  ఈ నెల 18న జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ సిటీలో సమస్యల అంశాలపై గట్టిగా మాట్లాడాలని బీజేపీ సమాయత్తమవుతోంది. బిజెపి కార్పొరేటర్లకు గట్టి కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News