Friday, May 3, 2024

హీరోగా చేస్తూ.. మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తా

- Advertisement -
- Advertisement -

తనదైన నటనతో ఆకట్టుకొని ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు సుహాస్. ఇప్పుడు హీరోగా, నటుడిగా బిజీగా ఉన్న సుహాస్ గురువారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ “మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని అనుకున్నాను. ‘కలర్ ఫోటో’తో హీరో అయ్యా. హీరోగా చేస్తూ… మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నాకు చాలా మంచి కథలు, పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆరు సినిమాలు చేస్తున్నాను. అయిదింటిలో లీడ్ క్యారెక్టర్‌గా, మరో సినిమాలో మామూలు క్యారెక్టర్ చేస్తున్నాను. ఇక హీరోగా చేసేటప్పుడు చాలా భయంగా ఉంటుంది. అదే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేటప్పుడు మన సీన్స్ వరకు చేస్తే చాలు” అని అన్నారు.

I should play lead role along with key roles: Suhaas

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News