Friday, April 26, 2024

త‌మిళియ‌న్‌నే పెళ్లీ చేసుకుంటా: ర‌ష్మిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన కన్నడ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా టాలీవుడ్ లో వరుస విజయాలతో తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు కోలీవుడ్, బాలీవుడ్ లో వరుస ఛాన్స్ లతో బిబీ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మిక తన అభిమానులు అడిగే ప్రశ్నలతోపాటు పలు విషయాలను పంచుకుంటుంది. తాజాగా రష్మిక తన పెళ్లిపై స్పందించింది. తాను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటోదో కూడా చెప్పింది. ”త‌మిళ‌నాడు సంస్కృతి, సంప్రదాయాలు న‌న్నుబాగా ఆక‌ర్షించాయి. ప్ర‌త్యేకించి అక్క‌డి ఆహారం. త‌మిళ‌నాడు ఫుడ్‌తో ప్రేమ‌లో ప‌డిపోయా. త‌మిళియ‌న్‌ను పెళ్లీ చేసుకుని, త‌మిళ‌నాడు కోడ‌లిని అవుతా” అని చెప్పుకొచ్చింది. అయితే, ఉన్నటుండి తన పెళ్లిపై మాట్లాడడంతో.. ఎవరితోనో రష్మిక ప్రేమాయణం నడుపుతుందని వార్తాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.

I will get marry a Tamilian: Rashmika Mandanna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News