Sunday, April 28, 2024

ఇబ్రహీంపట్నం ఎసిపి సస్పెన్షన్..

- Advertisement -
- Advertisement -

కాల్పుల్లో రియల్టర్ల దుర్మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎసిపి బాలకృష్ణా రెడ్డి 
రియల్టర్ల నుంచి ముడుపులు అందుకుంటున్నట్లు పోలీస్ అధికారులపై ఆరోపణ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక పోలీసు అధికారిపై వేటు పడింది. ప్రత్యర్థుల కాల్పుల్లో ఇద్దరు రియల్టర్లు చనిపోయిన కేసులో అప్పటి ఇబ్రహీంపట్నం ఎసిపి బాలకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎసిపిపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ చేపట్టిన పోలీస్ బాస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎసిపి బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన రంగారెడ్డి జిల్లా కర్ణంగూడ వద్ద రియల్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిని ప్రత్యర్థులు కాల్చి చంపేశారు. కర్ణంగూడ పరిధిలోని పదెకరాల స్థలం విషయమై ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి వర్గానికి చెందిన మట్టా రెడ్డి మరికొందరితో కలిసి శ్రీనివాస రెడ్డి, రాఘవేందర్ రెడ్డిని హతమార్చాడు.

ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపారు. రియల్టర్ల హత్య కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రియల్టర్ల నుంచి పోలీసు అధికారులు ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఎసిపి బాలక్రిష్ణారెడ్డి, ఎస్‌ఐ విజయ్, కానిస్టేబుల్‌పై కమిషనర్ మహేశ్ భగవత్ బదిలీ వేటు వేశారు. ఎసిపిపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ చేపట్టారు. మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు మట్టా రెడ్డి నుంచి డబ్బులు తీసుకున్నట్లు తేలడంతో ఎసిపి బాలక్రిష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డిజిపి మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Ibrahimpatnam ACP Suspended for Realtor murder

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News