Wednesday, May 1, 2024

జమ్ముకశ్మీర్‌లో ఐఇడి బాంబు నిర్వీర్యం

- Advertisement -
- Advertisement -

 IED bomb found in Bandipora

జమ్ముకశ్మీర్: బందిపొరా-శ్రీనగర్ రహదారిలో శనివారం పెను ప్రమాదం తప్పింది. అనుమానాస్పద ఐఇడి బాంబును ఆర్మీ భద్రతా బలగాల సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేసింది. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. బండిపూర్‌లోని ఎరిన్ నదిపై వంతెన సమీపంలో టైమర్‌తో చిన్న సిలిండర్‌తో కూడిన అనుమానాస్పద ఐఇడి బాంబును భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. ఆ ప్రాంతంలో  పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. బాంబు డిస్పోజల్‌ స్కాడ్‌ ఘటనాస్థలికి చేరుకుని ఐఇడి బాంబును నిర్వీర్యం చేసింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

 IED bomb found in Bandipora

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News