Saturday, May 4, 2024

కశ్మీరీల ఓపిక నశిస్తే కేంద్రం ఔటే

- Advertisement -
- Advertisement -
If J&K residents lose patience
కుల్గాం బహిరంగ సభలో మెహబూబా

శ్రీనగర్: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి, కశ్మీర్ మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ ఆదివారం కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఒకవేళ జమ్మూ కశ్మీర్ ప్రజానీకం ఓపిక, సహనం కోల్పోతే కేంద్రం ఉండదు, పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలను కేంద్రం దృష్టిలో పెట్టుకుంటే మంచిదని తెలిపారు. అక్కడి పరిస్థితిలో అయినా కేంద్రం గుణపాఠం నేర్చుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తరువాత జరిగిందేమిటనేది తెలుసుకదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె అఫ్ఘన్ తాలిబన్లకు హెచ్చరికలు వెలువరించారు. మునుపటిలాగా ఉంటే ఉనికికే ముప్పు అని తెలిపారు. తుపాకీ గొట్టం పాలనకు కాలం చెల్లిందన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడారు.

కశ్మీరీలకు సహనం వారసత్వంగా అబ్బింది. దీనికి ఎంతో ధైర్యం అవసరం. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వారు మారుతారు. ఇప్పటి సహనం ఉండకపోవచ్చు. అప్పుడు కేంద్రం ఉండకపోవచ్చు అన్నారు.పొరుగుదేశంలో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న ఇప్పటి దశను బాగా ఒంటపట్టించుకోండని, కశ్మీర్ సమస్యకు సంప్రదింపులతో పరిష్కారం వెతకండని సలహా ఇచ్చారు. అంతపెద్ద అగ్రరాజ్యం అమెరికా కూడా అక్కడ ఏమి చేయలేక మూటాముల్లె సర్దుకుని ఇంటిదారి పట్టిందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జీ చూపిన మార్గంలో వెళ్లండని, వెలుపలి పాకిస్థాన్‌తో, లోపలి కశ్మీర్‌తో అటువంటి చర్చలు పునః ప్రారంభిస్తే మంచిదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News