Monday, April 29, 2024

జనాభా తగ్గిస్తే ఎంపి సీట్ల కోతలా

- Advertisement -
- Advertisement -
Tamil Nadu Lok Sabha Seats Cut After Success
కేంద్రాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు

చెన్నై: జనాభాను సరిగ్గా అదుపు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ఎక్కువ స్థానాలు దక్కుతున్నాయని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు ఇటీవలి తమ ఆదేశాలలో కేంద్రానికి సూచించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలు జనాభాను విజయవంతంగా అదుపులో పెడుతున్నాయి. ఇది రికార్డుల పరంగా కూడా స్పష్టం అయింది. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక జనాభా ఉంది. ఈ రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ఎక్కువ సీట్లు కేటాయించడం సబబేనా? అని న్యాయమూర్తులు ఎన్ కిరుబకరన్, బి పుహళేందితో కూడిన ధర్మాసనం ఇటీవల తన మీమాంసను వ్యక్తం చేసింది.

పార్లమెంట్ స్థానాల విషయంలో తమిళనాడుకు అన్యాయం జరిగిందని, గత 14 ఎన్నికలను లెక్కలోకి తీసుకుంటే ఈ విధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ 5600 కోట్ల మేర పరిహారం దక్కాల్సి ఉంటుందని తెలిపింది. తమిళనాడుకు సంబంధించి 1962 వరకూ లోక్‌సభలో 41 మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉండేది. అయితే జనాభా తగ్గిందనే కారణంతో ఈ సభ్యుల సంఖ్యను 39కి కుదించారు. రెండు సీట్లు తగ్గాయి. అయితే ఇక్కడ సంఖ్య లెక్కలోకి రాదని, ప్రతి ఓటూ లెక్కలోకి వస్తుందని పేర్కొంటూ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1999లో అవిశ్వాస తీర్మానం దశలో జరిగిన పరిణామాలను గుర్తుంచుకోవాలని తెలిపింది. జనాభా తగ్గడాన్ని ప్రాతిపదికగా తీసుకుని సీట్ల సంఖ్యను లోక్‌సభలో తగ్గించారని, అయితే ఇందులో రాష్ట్రం తప్పిదం ఏదీ లేదని, లోక్‌సభలో సీట్ల సంఖ్య తగ్గితే ఎగువ సభ అయిన రాజ్యసభలో స్థానాల సంఖ్య పెంచవచ్చు కదా అని ప్రశ్నించారు.

ఓ వైపు దేశానికి అత్యంత అవసరం అయిన జనాభా నియంత్రణ విషయంలో వైఫల్యం చెందిన రాష్ట్రాలకు చట్టసభలో సీట్ల సంఖ్య ఎక్కువ చేయడం, మరో వైపు జనాభా నియంత్రణ విషయంలో బాగావ్యవహరించిన రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గిపోవడం జరుగుతోందని మద్రాసు హైకోర్టు తెలిపింది. భారతదేశం బహుభాషా, బహు మతాలు తెగల భిన్నత్వంలో ఏకత్వపు సూత్రీకణ ప్రాతిపదిక దేశం. 1956 రాష్ట్రాల పునర్వస్థీకరణ చట్టం ప్రతిపాదికన రాష్ట్రాలను భాషాప్రయుక్త ప్రాతిపదికన విభజించారు. ఈ క్రమంలో అధికారాలను అన్ని రాష్ట్రాలకు సమతుల్యతతో సమాన ప్రాతిపదికన కల్పించాల్సి ఉంటుంది. లోక్‌సభ స్థానాల విషయంలోనూ ఇది జరగాల్సిందే. ఈ విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. తమిళనాడులోని తెన్కాసీ పార్లమెంటరీ స్థానం రిజర్వ్ కోటా నుంచి తొలిగించాల్సి ఉందని దాఖలు అయిన పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం విచారణ క్రమంలో చట్టసభలలో సీట్ల సంఖ్య దక్షిణాదికి అన్యాయాన్ని ప్రస్తావించకనే ప్రస్తావించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News