Monday, April 29, 2024

అక్రమ కలప పట్టివేత

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్‌ః అక్రమంగా తరళిస్తున్న కలప పట్టిన సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకోండ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి ఆక్రమంగా కలప కారులో అక్రమంగా తరళిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు అటవీ ఆధికారులు డోర్లి గనుల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అటువైపుగా కలపతో వస్తున్న కారు డ్రైవర్, దాంతో పాటు వస్తున్న బైక్‌పై ఉన్న వ్యక్తులు ఆధికారులను గమనించి వాహనాలను వదిలి పారిపోయారు.

వాహనం వద్దకు వెళ్లి అక్రమ కలప ఉండడంతో అధికారులు వాహానాలను స్వాధీనం చేసుకోని దుంగలు, వాహనాలు రేంజ్ కార్యాలయానికి తరళించారు. వాహనంలో 14 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు, ఈ దుంగలు 0.394 సెంటిమీటర్లు ఉండి 27904 రూపాయల విలువ వచ్చిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా కలప తరళిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి రేంజ్ అదికారి ప్రవీణ్‌కుమార్, తిర్యాణి రేంజ్ సెక్షన్ అధికారులు విజయ్‌కుమార్, బిట్ అధికారులు ప్రకాష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News