Friday, April 26, 2024

రియల్ రంగంపై ‘కరోనా’ దెబ్బ

- Advertisement -
- Advertisement -

real estate

 

స్తబ్దుగా స్థిరాస్తి రంగం
రూ.25 కోట్ల నుంచి రూ.50 లక్షలకు
పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
ఎనిమిది రోజులుగా పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్

మనతెలంగాణ/హైదరాబాద్ : రియల్‌ రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎనిమిది రోజులుగా రిజిస్ట్రేషన్‌లు జరగడం లేదు. కొన్నిచోట్ల అరకొరగా జరిగినా అది కూడా అంతంత మాత్రమేనని అధికారులు పేర్కొంటున్నారు. మాములు రోజుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం రోజుకు రూ. 20 నుంచి 25 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఎనిమిది రోజులుగా రోజువారీ ఆదాయం రూ. 50 లక్షలకు పడిపోయినట్టుగా తెలిసింది.

రోజుకు 40 డాక్యుమెంట్లు జరిగే చోట రెండు, లేదా మూడు రిజిస్ట్రేషన్‌లు మాత్రమే జరుగుతున్నట్టుగా ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం భారీగా పడిపోయిందని స్టాంపులు,రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి మరో రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని భావించిన ఈ శాఖ అంచనాలు ఈ నేపథ్యంలో తారుమారు అయినట్టేనని ఆ శాఖ ఓ అంచనాకు వచ్చింది.

నిలిచిపోయిన కొత్త ఒప్పందాలు
లాక్‌డౌన్ ప్రభావంతో స్థిరాస్తి రంగం స్తబ్ధుగా మారింది. కొత్త ఒప్పందాలు పూర్తిగా నిలిచిపోగా, దస్తావేజుల నమోదు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ పరిమితం కాగా, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దస్తావేజుదారుల ప్రవేశంపై కూడా ఆంక్షలు విధించారు. సాధారణంగా స్థిరాస్తి లావాదేవీలపై ఒప్పందాల అనంతరం రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 60 రోజుల వరకు గడువు విధించుకుంటారు. దీని ప్రకారం ముందు జరిగిన ఒప్పందాల్లో కొన్ని దస్తావేజుల నమోదు పూర్తి కాగా మరికొన్ని లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ లభించక తాత్కాలికంగా వాయిదా పడుతున్నాయి.

మరోవైపు స్థిరా స్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సాధారణంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆస్తులు కొనుగోలుతో పాటు, అమ్మకందారులు,వారి సంబంధీకులు, సాక్షులు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కోసం నవదంపతులు, వారి కుటుం బ సభ్యులు తాకిడి అధికంగా ఉండేది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి వారం కావడంతో దస్తావేజు దారులతో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిట లాడేవి. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో పరిమిత స్లాట్ బుకింగ్, దస్తావేజుల దారులపై ఆంక్షలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.

తెరుచుకోని డాక్యుమెంట్ రైటర్ ఆఫీసులు
లాక్‌డౌన్ నేపథ్యలో దస్తావేజు లేఖరులు (ఏజెంట్లు) తమ షాపులను పూర్తీగా మూసేశారు. దీంతో స్థిరాస్తి దస్తావేజుల రూపకల్పన కూడా ఆగిపోయింది. దీంతో స్థిరాస్తి కొనుగోలు అమ్మకందారులు తమ లావాదేవీలను తాత్కాలింగా వాయిదా వేసుకున్నారు. మరోవైపు స్థిరాస్తికి సం బంధించిన కొత్త ఒప్పందాలు సైతం నిలిచిపోవడంతో వాటి ప్రభావం వచ్చే నెల వరకు ఉంటుందని స్థిరాస్తి నిపుణులు పేర్కొంటున్నారు.

చేతులు శుభ్రం చేసుకున్నాకే అనుమతి
స్థిరాస్తి లావాదేవిల నమోదు కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ తప్పని సరైంది. కరోనా ప్రభావంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ దస్తావేజుల నమోదును ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌కే పరిమితం చేసింది. ముహూర్తాలతో సంబం ధం లేకుండా రోజులు మూడు నాలుగు మించి స్లాట్ బుకింగ్‌కు అనుమతి లభించడం లేదు. స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వచ్చే వారికి టోకన్లలో సూచించిన సమయంలోనే లోనికి అనుమతిస్తున్నారు. లావాదేవీలు జరిపిన దస్తావేజుదారులతో పాటు సాక్షులకు మాత్రమే అనుమతి లభిస్తోంది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి చేతులను శుభ్రం చేసుకున్నాకే వారికి అనుమతిస్తున్నారు.

వంతుల వారీగా కార్యాలయానికి హాజరు
వాస్తవంగా రిజిస్ట్రేషన్ పక్రియలో రెండు పక్షాల వారి సంతకాలు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో వారికి శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకునేలా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సిబ్బంది వం తుల వారీగా కార్యాలయానికి హాజరవుతున్నారు. ఒకరోజు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే మరుసటి రోజు సీనియర్ అసిస్టెంట్ వచ్చేలా చర్యలు చేపట్టారు. రోడ్లపై పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తుండడంతో అ మ్మకం, కొనుగోలు దారులు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు రావడానికి జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్ర మే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ప్రజలు కార్యాలయానికి వస్తున్నట్టు ఆ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు.

 

Impact of corona virus on real estate
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News