Saturday, April 27, 2024

75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్ వెల్లడి

- Advertisement -
- Advertisement -

Corona symptoms

 

న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్ధారణ అయ్యే కరోనా కేసుల్లో దాదాపు 75 శాతం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు. తీవ్రంగా బాధపడుతున్న రోగుల సంఖ్యతోపాటు మరణాలు కూడా చాలా తక్కువేనని ఆయన అన్నారు. కరోనా తీవ్రత తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నందున కేజ్రీవాల్ పారదర్శకంగా ఉండాలని కాంగ్రెస్ నేత అజయ్ మకెన్ కాంక్షించగా, వాస్తవాలు వెల్లడించాలని ఢిల్లీ బిజెపి నేత మనోజ్ తివారీ కోరారు.

ఢిల్లీలో కరోనా రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్న పది ఆస్పత్రుల అధికారులు ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనల కన్నా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని, నాలుగు ఆస్పత్రుల్లో శుక్రవారం నాటికి 68 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించగా, వాస్తవానికి 92 మంది చనిపోయినట్టు బయటపడడంతో గందరగోళం నెలకొంది. దీనిపై కేజ్రీవాల్ ఆదివారం 73 మంది మాత్రమే మృతి చెందారని వివరించారు.

ఢిల్లీలో కరోనా కేసులు 6923 నమోదు కాగా, వీటిలో 2069 మంది కోలుకున్నారని, ఐసియులో 91 మంది, వెంటిలేటర్ సహాయంపై 27 మంది ఉన్నారని వివరించారు. ఈ 6923 మందిలో కేవలం 1476 మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారని కేజ్రీవాల్ చెప్పారు. మృతుల్లో 82 శాతం మంది 50 ఏళ్లు పైబడిన వారే అని తేలిందన్నారు. సీనియర్ సిటిజెన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్ల వద్దని, వారిని రైళ్ల లో పంపిస్తామని, మధ్యప్రదేశ్, బీహార్‌లకు రెండు రైళ్లు పంపామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News