Friday, May 3, 2024

ప్రారంభమైన తాంజిమ్ ఇన్ సాఫ్ రాష్ట్ర మహాసభలు

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: పట్టణంలోని ఏషియన్ ఫంక్షన్ హాల్‌లో తాంజిమ్ ఇన్ సాఫ్ రాష్ట్ర మూడొవ మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు తాంజిమ్ ఇన్ సాఫ్ జాతీయ అధ్యక్షుడు అజీజ్‌పాషా హాజరై మాట్లాడారు. దేశంలో మైనార్టీలకు రక్షణ కరువైందని అన్నారు. దేశంలో ఎక్కడా చూసిన ప్రతిరోజు మైనార్టీలపట్ల దాడులు జరుగుతున్నాయన్నారు. మైనార్టీల హక్కుల కోసం తాంజిమ్ ఇన్ షాప్ యూనియన్ పోరాడుతుందన్నారు.

మైనార్టీలైన క్రిస్టియన్, సిక్కు, బౌద్దుల కోసం వారిహక్కుల సాధనే ఇన్ సాఫ్ ఎల్లప్పుడు పోరాడుతున్న సంఘం అన్నారు. దేశంలో బిజెపిని తరిమికొట్టకపోతే ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందని, రైతు కార్మికుల జీవితాలు అదోగతి పాలవుతుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ పేరుతో అదానిలాంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతూ ఈ దేశాన్ని అదోగతి పాలు విమర్శించారు. మతోన్మాద కార్పొరేట్ బిజెపికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు, పించన్లు, రేషన్‌కార్డులు, రైతు రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చాకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై ప్రజల తరపున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దిన్, తాంజిమ్ రాష్ట్ర కన్వీనర్ ఫయాజ్, జాయింట్ కన్వీనర్ మునీర్ పటేల్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటి నర్సింహా, డివిజన్ కార్యదర్శి కె. నర్సింలు, అజారోద్దిన్, అశ్వక్ ఉసేన్, శంకర్, జంగిర్, మొగులయ్య, విశ్వనాథ్, మొయినోద్దిన్, హైదర్, గౌస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News