Saturday, April 27, 2024

చెలరేగిన సిరాజ్, కుల్దీప్.. బంగ్లాదేశ్ 133/8

- Advertisement -
- Advertisement -

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 133.5 ఓవర్లలో 404 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య బంగ్లాదేశ్ గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆరంభం నుంచే భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌ను కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ షాంటోను సిరాజ్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ చేశాడు. అతను ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన యాసిర్ అలీ (4)ను ఉమేశ్ యాదవ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో స్టార్ బ్యాటర్ లిటన్ దాస్, ఓపెనర్ జాకిర్ హసన్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన లిటన్ దాస్‌ను సిరాజ్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే జాకిర్ హసన్ (20)ను కూడా సిరాజ్ వెనక్కి పంపాడు. దీంతో బంగ్లాదేశ్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుది.
కుల్దీప్ మాయ
ఆ తర్వాత భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో చెలరేగి పోయాడు. అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన కుల్దీప్ యాదవ్ వరుస క్రమంలో వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. అతని ధాటికి కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (3), వికెట్ కీపర్ నురుల్ హసన్ (16), సీనియర్ బ్యాటర్ ముష్ఫికుర్ రహీం (28), తైజుల్ ఇస్లాం (0)లు పెవిలియన్‌కు చేరారు. కుల్దీప్ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక సిరాజ్‌కు మూడు వికెట్లు దక్కాయి. మరోవైపు రెండో రోజు ఆట ముగిసే సమయానికి మెహదీ హసన్ (16), ఇబాదత్ హుస్సేన్ (13) క్రీజులో ఉన్నారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే బంగ్లాదేశ్ మరో 271 పరుగులు చేయాలి.

ఇప్పటికే 8 వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ కష్టాల్లో చిక్కుకుంది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (86) సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40) అద్భుత బ్యాటిగ్‌తో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ స్కోరు 404కు చేరింది. బంగ్లా బౌలర్లలో తైజుల్, మెహదీ హసన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News