Saturday, May 4, 2024

కెఎల్ రాహుల్ అర్థ శతకం.. టీమిండియా స్కోరు 191/8

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఎనిమిదోవ వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. నిప్పులు చెరిగే బంతులతో సఫారి బౌలర్లు చెలరేగుతుండడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కోహ్లీ(38), శ్రేయస్ అయ్యర్(31)లు కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

వీరిద్దరూ ఔటైన తర్వాత కీపర్ కెఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్(24)లు జట్టు బాధ్యతను తీసుకుని స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 57 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో  రాహుల్(53), సిరాజ్(0)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News