Monday, April 29, 2024

లంకపై రికార్డు విజయం.. భారత్ కు వన్డే సిరీస్

- Advertisement -
- Advertisement -

Attack on Tribal Woman over Land Issue in MP

పల్లెకెలె: శ్రీలంకతో సోమవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు పది వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇంతకుముందు టి20సిరీస్‌ను కూడా భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 173 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ రేణుకా సింగ్ అద్భుత బౌలింగ్‌తో లంక ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చింది. ఓపెనర్లు హరిని పెరీరా(౦), వంశీ గుణరత్నె (3)లను రేణుక వెనక్కి పంపింది. అంతేగాక మాదవి (0) కూడా రేణుక ఔట్ చేసింది. ఇక మేఘన సింగ్, దీప్తి శర్మలు కూడా మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు. వీరిద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లంక జట్టులో అమా కంచనా 47(నాటౌట్), నీలాక్షి డి సిల్వా(32), కెప్టెన్ ఆటపట్టు(27), వికెట్ కీపర్ అనుష్క(25)లు మాత్రమే రాణించారు. మిగతావారు విఫలం కావడంతో లంక ఇన్నింగ్స్ 173 పరుగుల వద్దే ముగిసింది.
కదంతొక్కిన షఫాలి, మంధాన
తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మంధాన అండగా నిలిచారు. ఇద్దరు ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు లంక బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు మంధాన, అటు షఫాలి అద్భుత బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన షఫాలి 71 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మరోవైపు ధాటిగా ఆడిన స్మృతి మంధాన 83 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 94 పరుగులు చేసింది. దీంతో భారత్ 24.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

IND W Win by 10 wickets against SL W in 2nd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News