Saturday, May 4, 2024

ఆహ్లాదకర వైరుధ్యాల భూమి భారత్ : రాజ్‌నాధ్ సింగ్

- Advertisement -
- Advertisement -

India is a land of pleasant contradictions: Rajnath Singh

వడోదర : ఆహ్లాదకర వైరుధ్యాల భూమి భారతదేశమని, దేశం లోని వైరుధ్యం భిన్న విశ్వాసాలను పాటించే ప్రజల మధ్య ఎన్నడూ ఎలాంటి విభేదాలకు తావీయలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. స్థానిక స్వామినారాయణన్ ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , సొంత సంస్కృతి, చరిత్రను అవగాహన చేసుకుని, దానిని పదిల పరుచుకోనంత వరకు ఏ నాగరికత కూడా గొప్ప నాగరికత అనిపించుకోదని అన్నారు. ఈ గడ్డపై 72 తెగల ముస్లింలు ఉన్నారు. ప్రపంచ దేశాల్లోనే అత్యధిక స్థాయిలో ముస్లిం తెగలు ఇక్కడే ఉన్నారు. ప్రపంచం లోనే అతి పురాతన చర్చికూడా ఇక్కడే ఉంది అని రాజ్‌నాధ్ సింగ్ చెప్పారు. యువత నూతన జీవన విధానాలను అక్కున చేర్చుకుంటున్న విధంగానే మన సంస్కృతీ వారసత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వడోదర సిటీ లోని కరెలిబాగ్ ప్రాంతంలో స్వామి నారాయణ్ ఆలయం నిర్వహిస్తున్న సంస్కార్ అభయ్‌దే శివిర్‌లో యువ భక్తులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు రాజ్‌నాధ్‌ను ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News