Friday, May 3, 2024

భారత్@2….. బ్రెజిల్@3

- Advertisement -
- Advertisement -

India reached second place in corona cases

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత పది రోజుల నుంచి దాదాపుగా 80 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కరోనా కేసులు సంఖ్య 41.34 లక్షలకు చేరుకోవడంతో బ్రెజిల్ నెట్టేసి రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌లో రోజుకు 1000కి పైగా మంది కరోనాతో మృతి చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 89,690 మందికి కరోనా వైరస్ సోకగా 1055 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందని వారి సంఖ్య 70,688కి చేరుకుంది. అమెరికాలో 64.31 లక్షల కరోనా కేసులో తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో భారత్ (41.34 లక్షలు), మూడో స్థానంలో బ్రెజిల్(41.13లక్షల)లు ఉన్నాయి. మృతుల విషయంలో వరసగా అమెరికా(192818), బ్రెజిల్ (126230), ఇండియా(70688), మెక్సికో(67326)లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News