Saturday, May 11, 2024

అఫ్ఘానిస్థాన్‌పై సమావేశం నిర్వహించనున్న భారత్!

- Advertisement -
- Advertisement -
10న సమావేశం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వం
పాకిస్థాన్, చైనాలకు ఆహ్వానం, కానీ…

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో నెలకొంటున్న పరిస్థితులపై అత్యున్నత స్థాయి ప్రాంతీయ భద్రతా సమావేశాన్ని భారత్ నిర్వహించబోతున్నది. తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక నిర్వహించబోతున్న సమావేశం ఇది. ప్రాంతీయ భద్రతా సమావేశం ఇదివరలో 2018 సెప్టెంబర్, 2019 డిసెంబర్‌లో జరిగింది. ఆ తర్వాత కోవిడ్-19 కారణంగా జరగలేదు. ఇక తాజా సమావేశం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన నవంబర్ 10న జరగనున్నది. ఈ సమావేశానికి పంపిన ఆహ్వానాలను అనేక దేశాలు ప్రశంసించాయి. ఈ సమావేశంలో కేవలం అఫ్ఘానిస్థానే కాక అన్ని మధ్య ఆసియా దేశాలు పొల్గొనబోతున్నాయి. సమావేశంలో పాల్గొంటామని రష్యా, ఇరాన్ సమ్మతి తెలిపాయి. ఆహ్వానం పంపినప్పటికీ చైనా, పాకిస్థాన్ ఇంకా జవాబివ్వలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News