Sunday, May 12, 2024

2027 నాటికి మూడో స్థానానికి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే 2027 సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ జెఫరీస్ అంచనా వేసింది. నాలుగేళ్లలో భారత్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 5 ట్రిలియన్ డాలర్లను చేరుకోనుంది. జపాన్, జర్మనీ దేశాలను అధిగమించి భారత్ 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా మారనుందని నివేదిక పేర్కొంది. భారత్‌లో సంస్థాగత బలం, పాలనలో మెరుగుదల, అపారమైన కార్మికశక్తి వల్ల ఇండియా వేగంగా వృద్ధిని సాధిస్తోందని సంస్థ నివేదించింది.

ప్రస్తుతం భారత్ మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కానీ ప్రపంచ సూచీలో భారత్ ఇప్పటికీ 1.6 శాతం (10వ ర్యాంక్) క్షీణతో ఉంది. అయితే మార్కెట్లో ప్రవాహం, కొన్ని అంశాల వల్ల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత 15 నుంచి 20 సంవత్సరాల చరిత్రలో మార్కెట్ రాబడులు, కొత్త లిస్టింగ్‌ల వల్ల 2030 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకుంటుందని నివేదిక తెలిపింది. జిఎస్‌టి అమలు, రెరా చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం రోడ్డు, రవాణా వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టిపెడుతోంది, అలాగే డిజిటల్ ఇన్‌ఫ్రా (యుఐడి, యుపిఐ, డిబిటి) వంటివి స్టార్టప్ ఎకో సిస్టిమ్‌కు దోహదం చేస్తున్నాయని నివేదిక వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News