Home తాజా వార్తలు సోనా బియ్యం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది: ఎర్రబెల్లి

సోనా బియ్యం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది: ఎర్రబెల్లి

India wait for Telangana sona rice

 

జనగాం: కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పచ్చదనం-పరిశుభ్రతకి సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. గత పాలనలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారని, సిఎం కెసిఆర్ పాలనలో ఉద్యోగాలు వదిలి, వ్యవసాయం చేసేందుకు యువత గ్రామాల బాట పడుతున్నారని కొనియాడారు. తెలంగాణ సోనా బియ్యం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోందని, మహబూబాబాద్‌లో 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని ఎర్రబెల్లి తెలియజేశారు. ఆకెరు వాగుపై ఆరు కొత్త చెక్ డ్యామ్‌లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.