Monday, April 29, 2024

రెండో టీ20లో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: అహ్మదాబాద్ : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో అయిదు టి20ల సిరీస్ ఇప్పుడు 1 1తో సమమైంది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిరేశించిన 165 పరుగుల లక్షాన్ని భారత్ 17.5 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 49 బంతుల్లో 5 ఫోర్లు, మూ డు సిక్స్‌లతో 73)తో పాటు అరంగేట్రం బ్యాట్స్‌మన్ ఇషా న్ కిషన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 56) అర్ధ సెంచరీలతో రెచ్చి పోయారు. చివర్లో రిషబ్ పంత్(13 బంతుల్లో రెండు ఫోర్లు, మరో రెండు సిక్స్‌లతో26), శ్రేయస్ అయ్యర్(8నాటౌట్) కూడా ధాటిగా ఆడారు. ఓపెనర్ కెఎల్ రాహుల్ మరోసారి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషాన్ తొలి అంతరాతీయ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రాంభంనుంచే చెలరేగి పోయా డు. ఓ వైపు కిషన్ రెచ్చిపోయి ఫోర్లు, సిక్స్‌లు బాదుతుండగా, కోహ్లీ సైతం వేగంగా పరుగులు చేస్తూ అతడికి చక్కటి ప్రోత్సాహం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించడంతో భారత్ విజయం సునాయాసం అయింది. తర్వాత వచ్చిన పంత్ కూడా క్రీజ్‌లోకి దిగినప్పటినుంచే భారీ షాట్‌లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో కోహ్లీ టి20ల్లో 26వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో కోహ్లీ టి20లలో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు కూడా. పంత్ ఔటయిన తర్వాత కూడా కోహ్లీ దూకుడు తగ్గించలేదు.17వ ఓవర్‌లో ఫోర్, సిక్స్ బాది విజయాన్ని పూర్తి చేశాడు.
మరోసారి రాణించిన రాయ్
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ భారత్ ముందు 165 పరుగుల విజాయ లక్షాన్ని ఉంచిం ది. తొలి ఓవర్‌లోనే జోస్ బట్లర్(0)ను భువనేశ్వర్ ఔట్ చేయడంతో భారత్‌కు శుభారంభం దక్కింది. అయితే ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మలన్‌తో కలిసి మరో ఓపెనర్ జేసన్ రాయ్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ధాటి గా ఆడుతూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చాహల్ విడదీశాడు. మలన్‌ను వికెట్ల ముందు దొరకపుచ్చుకుని పెవిలియన్‌కు పంపాడు. మలన్ 23 బంతుల్లో నాలు గు ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన బెయిర్‌స్టోతో కలిసి రాయ్ మరింత రెచ్చి పోయే ప్రయత్నం చేశాడు. అయితే అర్ధ శతకానికి చేరువైన అతడిని వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. రాయ్ కేవలం 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 49 పరుగులు చేశాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో, మోర్గాన్‌లు వేగంగానే పరుగులు సాధించినా ఎక్కువ సేపు నిలవలేక పోయారు. బెయిర్ స్టో 15 బంతుల్లో 20పరుగులు చేయగా, మోర్గాన్ 20 బంతుల్లో నాలుగు బౌండరీలతో 28 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ బెయిర్‌స్టోను, శార్దూల్ ఠాకూర్ మోర్గాన్‌ను పెవిలియన్‌కు పంపారు. చివర్లో బెన్‌స్టోక్స్ (24), సామ్ కరన్‌లు ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ స్కోరు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 164 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఢాకూర్‌లకు చెరి రెండు వికెట్లు దక్కాయి.
సూర్యకుమార్, ఇషాన్‌లకు చోటు
కాగా రెండో టి20 మ్యాచ్‌కి టీమిండియాలో రెండు మార్పులు చేశారు. తొలి మ్యాచ్‌లో ఆడిన శిఖర్ ధావన్, అక్షర్ పటేల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను జట్టులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఇద్దరూ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసినట్లయింది.

India win by 7 wickets in 2nd Test against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News