Monday, May 6, 2024

2 ఎంహెచ్- 60ఆర్ హెలికాప్టర్లు

- Advertisement -
- Advertisement -
Indian Navy gets 2 MH-60R helicopters
భారత్‌కు అందచేసిన అమెరికా

వాషింగ్టన్: భారత్-అమెరికా రక్షణ సంబంధాల బలోపేతానికి మరో సంకేతంగా అమెరికా నౌకా దళం శనివారం కొనుగోలు ఒప్పందంలో భాగంగా బహుళ ప్రయోజనకర హెలికాప్టర్లు(ఎంఆర్‌హెచ్) ఎంహెచ్-60ఆర్‌లను మొదటి రెండింటిని భారత నౌకాదళానికి అందచేసింది. విదేశీ సైనిక అమ్మకాల కింద లాక్‌హీడ్ మార్టిన్ తయారుచేసిన 24 ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లను అమెరికా ప్రభుత్వం నుంచి భారతీయ నౌకాదళం కొనుగోలు చేస్తోంది. 2.4 బిలియిన్ డాలర్ల వ్యయంతో వీటిని భారతీయ నౌకాదళం కొనుగోలు చేస్తోంది. శాన్ డైగోలోని నావల్ ఎయిర్ స్టేషన్ నార్త్ ఐలాండ్ వద్ద శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా నేవీ నుంచి భారత నేవీకి హెలికాప్టర్ల బదిలీ లాంఛనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సాంధు పాల్గొన్నారు. అన్ని వాతావరణాలను తట్టుకునే విధంగా తయారుచేసిన ఈ బహుళ ప్రయోజనకర హెలికాప్టర్లను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడాన్ని భారత్-అమెరికా ద్వైపాక్షిక రక్షణ సంబంధాలలో ముఖ్యమైన మైలురాయిగా తరంజిత్ సింగ్ అభివర్ణించారు. భారత్-అమెరికా మైత్రీబంధం పతాకస్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు.

Indian Navy gets 2 MH-60R helicopters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News