Saturday, April 27, 2024

చాదర్‌ఘాట్‌లో రౌడీషీటర్ హత్య

- Advertisement -
- Advertisement -

Rowdy Sheeter killed in Chaderghat

హైదరాబాద్: దుండగులు కత్తులతో పొడవడంతో రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…..ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ముస్తాక్‌పై రౌడీషీట్ ఉంది. పలు నేరాలు చేయడంతో స్థానికంగా కొందరితో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పాతకక్షల నేపథ్యంలో ముస్తాక్‌ను కొందరు దుండగులు కత్తులతో నరికి చంపివేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్‌స్పెక్టర్ అన్నారు.

Rowdy Sheeter killed in Chaderghat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News