Friday, May 3, 2024

ఏడో రోజూ రికార్డు స్థాయిలోనే ముగిసిన దేశీయ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -


ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధిరేటు, త్రైమాసిక ఫలితాలు సానుకూలతలు దేశీయ సూచీలను ముందుకు నడిపాయి. ఒక్క ఫార్మా రంగం స్టాకులు తప్పించి అన్ని రంగాల స్టాకులు లాభాల్లోనే ముగిశాయి.  దేశీయ సూచీలు జీవితకాల గరిష్ఠాల్ని తాకాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే గత  ఏడు సెషన్లలో సూచీలు గరిష్ఠ స్థాయిని నమోదుచేస్తూ వస్తున్నాయి. సోమవారం కూడా గరిష్ఠాన్ని తాకింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మంచి ఫలితాలు ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగం స్టాకులు పరుగులు తీశాయి. పాజిటివ్ ట్రెండ్ కొనసాగడంతో ముంబయి స్టాక్ ఎక్స్‌ఛేంజీ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 459.64 పాయింట్లు లేక 0.75 శాతం పెరిగి 61765.59 వద్ద ముగిసింది. కాగా నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజీ బెంచిమార్క్ సూచీ నిఫ్టీ50 దాదాపు 138.50 పాయింట్లు లేక 0.76 శాతం పెరిగి 18477.05 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 343.90 పాయింట్లు లేక 0.87 శాతం పెరిగి 39684.80 వద్ద ముగిసింది. ఇండియా విక్స్ 2.07 శాతం తగ్గి 15.7675వద్ద ముగిసింది.

ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉననప్పటికీ భారత మార్కెట్లు పాజిటివ్‌గానే మొదలయ్యాయి. త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి అనుకున్న దానికంటే చాలా మందగించింది. మార్కెట్ మధ్యాహ్నం సెషన్‌కల్లా కొనుగోళ్లు బలం పుంజుకున్నాయి. భారత తొటి డేటా ఆర్థిక వ్యవస్థ తిరిగిపుంజుకుంటుందన్న సంకేతాలు ఇవ్వడంతో సెంటిమెంట్ మరింత బలపడింది. మెటల్ కంపెనీల షేర్లు మంచి బలాన్ని పుంజుకున్నాయి.

అత్యధికంగా లాభపడిన షేరు హిందాల్కో.   ఈ షేరు విలువ 26.70 లేక 5.17 శాతం పెరిగి రూ. 542.80 వద్ద ముగిసింది. కాగా అత్యధికంగా నష్టపోయిన షేరు హెచ్‌సిఎల్ టెక్. ఈ షేరు దాదాపు 29.75 లేక 2.38 శాతం తగ్గి రూ. 1221.40 వద్ద ముగిసింది. అన్ని రంగాలతో పోల్చినప్పుడు నిఫ్టీ ఫార్మా చాలా అధ్వానంగా ముగిసింది. ఇన్ఫోసిస్ , టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, మారుతి, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, టిసిఎస్ రాణించగా, హెచ్‌సిఎల్ టెక్, ఎంఅండ్‌ఎం, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News