Sunday, May 5, 2024

స్పేస్ ఎక్స్ క్రూ3 మిషన్‌కు ఇండో అమెరికన్ రాజాచారి ఎంపిక

- Advertisement -
- Advertisement -

ఇండో అమెరికన్, అమెరికా ఎయిర్‌ఫోర్స్ కల్నల్ రాజాచారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడానికి స్పేస్ ఎక్స్ క్రూ3 మిషన్‌కు కమాండర్‌గా నాసా, ఐరోపా స్సేస్ ఏజెన్సీలు ఎంపిక చేశాయి.

 

వాషింగ్టన్ : ఇండో అమెరికన్, అమెరికా ఎయిర్‌ఫోర్స్ కల్నల్ రాజాచారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడానికి స్పేస్ ఎక్స్ క్రూ3 మిషన్‌కు కమాండర్‌గా నాసా, ఐరోపా స్సేస్ ఏజెన్సీలు ఎంపిక చేశాయి. 43 ఏళ్ల చారి కమాండర్‌గా ఎంపిక కాగా, నాసాకు చెందిన టామ్ మార్ష్‌బర్న్ పైలట్‌గా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మట్టియాస్ మౌరెర్ మిషన్ స్పెషలిస్టుగా వ్యవహరిస్తారు. వచ్చే సంవత్సరం ఈ మిషన్ ప్రారంభం కానున్నది. తోటి వ్యోమగాములతో శిక్షణ పొందనుండడం తనకు ఉద్వేగాన్ని కలిగిస్తోందని, చారి ట్వీట్ చేశారు. చారి మిల్‌వాకీలో జన్మించినా, లోవా లోని సిడర్‌ఫాల్స్ తన స్వంత నగరంగా బావిస్తుంటారు. ఆయన 2017లో నాసా వ్యోమగామి అయ్యారు. ఆర్టిమిస్ బృంద సభ్యుడుగా ఈనెల ఆయన ఎంపికయ్యారు. చారి తండ్రి శ్రీనివాస్ చారి యువకునిగా ఉన్నప్పుడే హైదరాబాద్ నుంచి అమెరికాకు ఇంజినీరింగ్ డిగ్రీ చదవడానికి వచ్చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News