Wednesday, May 15, 2024

చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

Inquiry into MLA Chennamaneni's citizenship

మనతెలంగాణ/హైదరాబాద్ : వేములవాడ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది.ఈక్రమంలో తన జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో చెన్నమనేని కౌంటర్‌పై వివరణకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు రెండు వారాలు గడువు ఇచ్చింది. మరోసారి గడువు కోరవద్దని, తుది వాదనలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. ఈ మేరకు విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై గత కొంతకాలంగా హైకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. రమేష్ పౌరసత్వం వివాదంపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎంఎల్‌ఎగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News