Monday, April 29, 2024

హెచ్1బి వీసాల జారీని రెట్టింపు చేయండి

- Advertisement -
- Advertisement -

గ్రీన్‌కార్డు కోటాను ఎత్తేయండి
బైడెన్ సర్కార్‌కు యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సూచన

H1B visas doubled in america
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నైపుణ్య ఉద్యోగాల కొరతను దృష్టిలో పెట్టు కొని హెచ్1బి వీసాల జారీని రెట్టింపు చేయాలని జో బైడెన్ ప్రభుత్వాన్ని యుఎస్ చాంబన్ ఆఫ్ కామర్స్ అభ్యర్ధించింది. అలాగే గ్రీన్‌కార్డుల జారీలో దేశాల వారీ కో టా ఎత్తివేయాలని కూడా కోరింది. పరిమిత సంఖ్యలో గ్రీన్ కార్డు లు ఇస్తుండడంతో ప్రవాసులు ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొంది. దీ నివల్ల ఉద్యోగుల కొరత తీవ్రతరమవుతుందని తెలియజేసింది. కనుక ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరింది. అంతేగాక గ్రీన్‌కార్డు కంట్రీక్యాప్ కింద కుటుం బాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చే హెచ్1బి విధానాన్ని రద్దు చేసి ఒక్కొక్కరికి ఇచ్చే లా మార్పు చేయాలని సూచించింది. ఈ విధానం వల్ల ప్రస్తుతం 65 వేల వీసాల జారీని రెట్టింపు చేసే వీలు కలుగుతుందని తెలిపింది.

ఇక అమెరికాలు నైపుణ్య ఉద్యోగాలను తీర్చడానికి హెచ్1బి, హెచ్2బి వీసాలను రెట్టింపు చేయడమే ఏకైక పరిష్కారమని ఈ సందర్భంగా యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. అలాగే ఇమిగ్రేషన్ చట్టాల్లో కూడా మార్పులు చేయాలని సూచించింది. ‘ మనం కార్మికుల కు అవసరమైన నైపుణ్యాలలతో ఆయుధాలను కలిగి ఉండాలి. చాలామంది అమెరి కన్లను పక్కదారి పట్టించే అడ్డంకులనుమనం తప్పక తొలగించాలి. అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన వారిని ని యమించాలి. కార్మికుల కొరత ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సృష్టికర్తలను వెనక్కి నెట్టివేస్తోంది’ అని ఈ సందర్భంగా యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు, సిఇఓ సుజాన్నే క్లార్క్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News